సింగపూర్ స్పోర్ట్స్ స్కూలును పరిశీలించిన చంద్రబాబు
అమరావతి, 28 జూలై (హి.స.)సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సింగపూర్(Singapoor) టూర్ బిజీగా కొనసాగుతోంది. అమరావతిని అభివృద్ధి చేసేందుకు అక్కడి స్కూళ్లు, ప్రాజెక్టులను ముఖ్యమంత్రి టీమ్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సింగపూర్ స్పోర్ట్స్ స
సింగపూర్ స్పోర్ట్స్ స్కూలును పరిశీలించిన చంద్రబాబు


అమరావతి, 28 జూలై (హి.స.)సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సింగపూర్(Singapoor) టూర్ బిజీగా కొనసాగుతోంది. అమరావతిని అభివృద్ధి చేసేందుకు అక్కడి స్కూళ్లు, ప్రాజెక్టులను ముఖ్యమంత్రి టీమ్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్ సందర్శన అనంతరం సింగపూర్ స్పోర్ట్స్ స్కూలును పరిశీలించారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్‌తో మాట్లాడారు. వినోదం, పర్యాటకం కోసం కాకుండా అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేసేలా స్పోర్ట్స్ స్కూళ్లు ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా సింగపూర్ ప్రయత్నిస్తోందని సీఎంకు స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. ఉన్నత ప్రమాణాలు.. అత్యున్నత పని తీరు కలిగిన వ్యవస్థలను రూపొందించుకుని స్పోర్ట్స్ స్కూల్ నడుపుతున్నామని సీఎంకు పాఠశాల ప్రిన్సిపల్ వివరించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్ధులకు స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని స్పష్టం చేశారు. జాతీయ క్రీడా అసోసియేషన్లు, అకాడమీలతో ఇలాంటి స్కూళ్లు పని చేసేలా తీర్చిద్దామని సీఎం చంద్రబాబుకు పాఠశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande