ఏపీ రాజ్‌భవన్‌కు మాజీ సీఎం జగన్‌
అమరావతి, 28 జూలై (హి.స. )సీ ఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోజు సాయంత్రం మాజీ సీఎం జగన్(Former CM Jagan).. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ను కలిసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాజ్
ఏపీ రాజ్‌భవన్‌కు మాజీ సీఎం జగన్‌


అమరావతి, 28 జూలై (హి.స. )సీ ఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోజు సాయంత్రం మాజీ సీఎం జగన్(Former CM Jagan).. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ను కలిసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ పర్మిషన్ (Raj Bhavan permission) తీసుకున్నట్లు తెలుస్తుంది. సాయంత్రం గవర్నర్ తో జగన్ సమావేశమై.. కూటమి ప్రభుత్వం (coalition government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగం (Red Book Constitution) అమలు చేస్తున్నారని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలో ఉండగా జగన్ రాజ్ భవన్ వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande