అమరావతి, 28 జూలై (హి.స.) మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)పై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) మండిపడ్డారు. గతంలో అధికార దుర్వినియోగం చేసి జగన్ తన గొయ్యి తనే తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడులో సుపరిపాలనలో తొలి అడుగు(Suparipalanalo Tholi Adugu) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, ఆకువీడు ప్రజలకు ఏం కావాల్లో అడిగేందుకు వచ్చానని తెలిపారు. తన పర్యటనకు చెట్లు కొట్టాల్సిన పని లేదని, షాపులు కట్టక్కర్లేదని, పరదాలు అసలు అవసరం లేదని అనిత సెటైర్లు వేశారు. తన అజెండా అభివృద్ధి, సంక్షేమని, పగలు ప్రతీకారాలు కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని హోంమంత్రి అనిత విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి