ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్‌లో క్లౌడ్ బరస్ట్ అయిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. శిథిలాలు ప్రవహించే ప్రాంతాలను మూసేశామని.. దీని కారణంగా చాలా మంది ప్రజలు చిక్కుకుపో
HDL- clouds in monday morning


న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్‌లో క్లౌడ్ బరస్ట్ అయిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. శిథిలాలు ప్రవహించే ప్రాంతాలను మూసేశామని.. దీని కారణంగా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని చెప్పారు. పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి రుద్రప్రయాగ్, చమౌలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు పేర్కొన్నారు. అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. అనేక మంది గాయడపడ్డారని వెల్లడించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అధికారుల సమాచారం మేరకు.. థరాలి మార్కెట్ ప్రాంతంలో ఇళ్లు, భవనాలు, తహసీల్ కాంప్లెక్స్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారిక నివాసం, దుకాణాలు, వాహనాలు, అనేక నివాసాలు భారీగా మట్టితో కప్పబడినట్లుగా తెలుస్తోంది. ఇక మణిమహేష్ యాత్రకు వెళ్లి 8 వేల మంది యాత్రికులు చిక్కుపోయినట్లు సమాచారం అందగానే.. రక్షణ బృందం సహాయ చర్యలు చేపట్టింది. ఇక రుద్రప్రయాగ్, చమోలీలో పలు కుటుంబాలతో పాటు పశువులు జల సమాధి అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande