న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్‌కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
తాజాగా సరికొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఎన్డీఏ కూటమికి 300లకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. 272 మెజారిటీ మార్కు దాటలేకపోయింది. 2019లో మాత్రం సొంతంగా 303 సీట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరిగితే మాత్రం బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
ఇక గతేడాది 234 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి 208 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ