బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం..సరస్వతి ఆలయం వరకు వరద..
తెలంగాణ, నిర్మల్. 30 ఆగస్టు (హి.స.) ఎగువన భారీ వర్షాతో బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వ్యాస మహర్షి గుడి, ఆలయ ఆవరణలోని టీటీడీ గృహాల వరకు వరద చేరింది. ఆల
బాసర గోదావరి


తెలంగాణ, నిర్మల్. 30 ఆగస్టు (హి.స.)

ఎగువన భారీ వర్షాతో బాసర వద్ద

గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వ్యాస మహర్షి గుడి, ఆలయ ఆవరణలోని టీటీడీ గృహాల వరకు వరద చేరింది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జ్లు, సత్రాలు, పుష్కరఘాట్ నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి నీటమునిగాయి. గోదావరిపై వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండటంతో గంగాదేవి, సూర్యేశ్వర శివాలయం, అక్షర కాలనీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, వైశ్య సత్రం వరకు బ్యాక్ వాటర్ చేరాయి.

అక్షర కాలనీలో వరద నీటిలో చిక్కుకున్న వారిని అధికారులు ట్రాక్టర్ల సహాయంతో తరలించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande