తెలంగాణ, మెదక్. 30 ఆగస్టు (హి.స.)
మెదక్ జిల్లాలోని
కొల్చారం మండలం రంగంపేట
సహకార సంఘానికి గత 15 రోజులుగా యూరియా రావడం లేదని రైతులు ఆగ్రహంతో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం గంటసేపు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కొల్చారం మండలంలో యూరియా డిమాండ్ను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం చెందిందని, వారి నిర్లక్ష్యం కారణంగానే మండలానికి యూరియా కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట సహకార సంఘానికి యూరియా ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటూ గత 15 రోజులుగా సహకార సంఘం చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారుల నుండి సరైన సమాధానం లేకపోవడంతో రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు