హరీశ్ రావుతో రాజాసింగ్.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ఆసక్తిగా మారింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభానికి ముందు లాబీలో రాజాసింగ్ ముందు వెళ్తు
రాజాసింగ్


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ఆసక్తిగా మారింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభానికి ముందు లాబీలో రాజాసింగ్ ముందు వెళ్తుండగా వెనుక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వచ్చారు. ఈ సందర్భంగా ముందు వెళ్తున్న రాజాసింగ్ తన వెనుక వస్తున్న హరీశ్ రావు, బీఆర్ఎస్ సభ్యులను కలిసి వారితో పాటు ముందుకు కదిలారు. అయితే బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ త్వరలోనే మరో పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన వంటి పార్టీలలో ఏదో ఒకదాంట్లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజాసింగ్ బీఆర్ఎస్ సభ్యులతో కలవడం రాజకీయవర్గాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. కలవడం

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande