హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ లోని కమిటీ హాలులో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీఎస్ రామకృష్ణ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రప్రథమంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది.
పంచాయతీరాజ్ అదేవిధంగా రాష్ట్రంలో చట్టం-2018లోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు, సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అసాధారణ పరిస్థితుల్లో సంబంధిత స్థానిక సంస్థల్లోని పరిస్థితుల ఆధారంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తవేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..