కలెక్టర్ ఆదేశాలతో వరద నష్టం వివరాలు సిద్ధం చేస్తున్న కామారెడ్డి జిల్లా అధికారులు
తెలంగాణ, 30 ఆగస్టు (హి.స.) కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం అయింది. భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. రోడ్లపై నీరు చెరువులను తలపించాయి. అన
కామారెడ్డి వర్షం


తెలంగాణ, 30 ఆగస్టు (హి.స.)

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు

బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం అయింది. భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. రోడ్లపై నీరు చెరువులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి పట్టణం వరదల్లో చిక్కుకు పోయింది. పలు మండలాల్లో వరదలు పొంగిపొర్లాయి. కార్లు, మనుషులు కొట్టుకుపోయారు. జాతీయ రహదారి మూసుకుపోయింది. పోలీసులు, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో తలమునకలైంది. జిల్లాలో వరద బీభత్సాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. వరద నష్టం వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. వరద నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లెక్కలు వేసుకున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande