వనస్థలిపురంలో గణపతి హుండీ మరియు లడ్డూ చోరీ..
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో గణేశుడి లడ్డూ మరియు హుండీ లోని డబ్బుల దొంగతనం హాట్ టాపిక్గా మారింది. గణేష్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేజ్-2
గణపతి లడ్డు


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)

ఎల్బీనగర్ నియోజకవర్గం

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో గణేశుడి లడ్డూ మరియు హుండీ లోని డబ్బుల దొంగతనం హాట్ టాపిక్గా మారింది. గణేష్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేజ్-2, రోడ్డు నంబర్-18లో 'భారత్ మాత యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులలో భాగంగా శుక్రవారం రాత్రి పూజలు చేసిన తర్వాత మండపానికి పరదా కట్టి ఇళ్లకు వెళ్లారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయం వెళ్లి చూడగా లడ్డూ, వినాయకుడి హుండీలో ఉన్న డబ్బులు కనిపించలేదు. వెంటనే మండపం ముందు ఉన్న సీసీ కెమెరాల్లో చెక్ చేయగా ఇద్దరు దుండగులు చోరీ చేసిన దృశ్యాలు కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. వెంటనే ఉత్సవ కమిటీ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande