తెలంగాణ, కామారెడ్డి. 31 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో కొనసాగుతున్న వరద ప్రభావిత పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు టీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, బల్మూరి వెంకట్, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని జీఆర్ కాలనీలో ఈ ఎమ్మెల్సీల బృందం పర్యటించి.. బాధితులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయశాంతి.. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలిపారు. అక్కడి దృశ్యాలు చూస్తోంటే గుండె తరుక్కుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు సహాయం అందిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా నిలుస్తారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు