అమరావతి, 31 ఆగస్టు (హి.స.)
మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP) లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం పంపింది ఆస్ట్రేలియన్ హైకమిషన్. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావా లని ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని వెల్లడి.. 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా SVPలో భాగస్వాములయ్యారని ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ