హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇస్తలేరు అని సీఎం రేవంత్ అంటున్నారు.. ఎందుకు ఇస్తలేరు.. సీఎం స్వయంగా చెప్తున్నరు అపాయింట్ మెంట్ ఇస్తే చెప్పులెత్తుకపోతరేమోనని ఇస్తలేరని అంటున్నడు.
ఇట్ల మాట్లాడాకా అపాయింట్ మెంట్స్ వస్తయా అని ప్రశ్నించారు. భాష మార్చుకో.. బుద్ధి మార్చుకో అని కేటీఆర్ సూచించారు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మొట్టమొదటి స్పీకర్గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని, శాసన మండలి తొలి ఛైర్మన్గా స్వామిగౌడ్ను నియమించాం. అడ్వకేట్ జనరల్గానూ బలహీనవర్గానికి చెందిన బీఎస్ ప్రసాద్ను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నియమించింది. కె. కేశవరావు, డి.శ్రీనివాస్ (డీఎస్), బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు నామినేట్ చేశాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు