తిరుపతి, 31 ఆగస్టు (హి.స.)
:కొర్లగుంట పట్టణ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. అశోక్ అనే వ్యక్తి కత్తితో ముగ్గురు వ్యక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను స్థానికులు ఆసపత్రికి తరలించారు. పట్టణ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నిన్న(శనివారం) అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ మేరక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అశోక్‌ను అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ