సీబీఐ పెండింగ్‌ కేసులు 7,072
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.): కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉందని కేంద్ర నిఘా కమిషన్‌(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం గమ
ACB


న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.): కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉందని కేంద్ర నిఘా కమిషన్‌(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఆదివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్‌లో ఉన్నాయి. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు 791 కేసులు, ఐదు నుంచి పదేళ్లలోపు 2,115 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పదేళ్లకు పైగా 2,281 కేసులు, 20 ఏళ్లకు పైగా 379 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. సీబీఐ, నిందితులు దాఖలు చేసిన 13,100 అప్పీళ్లు, సవరణలు సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 20 ఏళ్లకు పైగా 606 కేసులు, 15 ఏళ్లకు పైగా 1,227 కేసులు, 10 ఏళ్లకు పైగా 2,989 కేసులు, ఐదేళ్లకు పైగా 4,059 కేసులు, రెండేళ్లకు పైగా 1,118 కేసులు, ఏడాదికి పైగా 2,441 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande