హుజురాబాద్లో భారీ వర్షం.. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు
తెలంగాణ, 12 సెప్టెంబర్ (హి.స.) గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజురాబాద్ పట్టణం అతలాకుతలమైంది. రాత్రిపూట దాదాపు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపాతం 16 సెంటీమీటర్లుగా నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధిక వర్షపాతంగా రికార్డు సృష్టించ
హుజరాబాద్


తెలంగాణ, 12 సెప్టెంబర్ (హి.స.) గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజురాబాద్ పట్టణం అతలాకుతలమైంది. రాత్రిపూట దాదాపు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపాతం 16 సెంటీమీటర్లుగా నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధిక వర్షపాతంగా రికార్డు సృష్టించింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుండపోత వర్షం కారణంగా హుజురాబాద్లోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు వస్తువులను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. మామిళ్లవాడలోని బట్ట సంచుల తయారీ పరిశ్రమకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. దీంతో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

వర్షాల తీవ్రతను గుర్తించిన మున్సిపల్ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలో చేరిన నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు, మురికి కాలువలను శుభ్రం చేయడానికి, వరద నీటిని త్వరగా పారదోలడానికి జేసీబీలను ఉపయోగించి మార్గాన్ని సుగమం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande