తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 12 సెప్టెంబర్ (హి.స.)
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భువనగిరి నల్గొండ రహదారిపై భారీగా వరద నీటి ప్రవాహం చేరింది. దీంతో భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాత్రి నుంచి ఇరువైపుల రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితిని భువనగిరి రూరల్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరద నీరు కొద్దిగా తగ్గడంతో ద్విచక్ర వాహనాలు మినహా కార్లను భారీ వాహనాలను అనుమతించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు