తెలంగాణ, మంచిర్యాల. 12 సెప్టెంబర్ (హి.స.)
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తున్నది. శుక్రవారం ఉదయం సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై పులి కనిపించింది. రోడ్డు వెంట కల్వర్టుపై కూర్చొని గాండ్రిస్తూ కనిపించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు తమ ఫోన్లలో పులిని బంధించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు