తెలంగాణ, ఆసిఫాబాద్. 14 సెప్టెంబర్ (హి.స.)
ప్రతి ఒక్క విద్యార్థి తన తల్లి పేరుతో
మొక్క నాటి సంరక్షించుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి సెల్ఫీ లేదా ఫోటో దిగి ఆ ఫోటోను ECO CLUBS for MISSION Life Portal https://ecoclubs.education.gov.in/main పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు