తెలంగాణ, మెదక్ 14 సెప్టెంబర్ (హి.స.)
రైతులు వేసిన పంటకు యూరియా
చల్లడం అంటే ఓ సమస్యగా తయారైంది. పొలం వదిలి, సొసైటీ కేంద్రాలు, ఫర్టిలైజర్ షాప్ల వద్దకు యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట మండలాల్లో యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదివారం అక్కన్నపేట, కల్వకుంట గ్రామాల్లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు ఉదయం 5 గంటల నుండి పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిలబడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో రైతులకు టోకెన్లు ఇస్తూ.. యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇలాంటి దుస్థితి ఎన్నడూ చూడలేదని.. అన్నదాతలు వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు