బెట్టింగ్ యాప్స్ కేసులో ఊర్వశి, మిమికి నోటీసులు
ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.) దేశంలో ఢిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక కీలక మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కీలకంగా మారాయి. ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా, యాప్ స్టోర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల
బెట్టింగ్ యాప్స్ కేసులో ఊర్వశి, మిమికి నోటీసులు


ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.) దేశంలో ఢిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక కీలక మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కీలకంగా మారాయి. ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా, యాప్ స్టోర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రకటనల ద్వారా నడిచేవి. ఇప్పుడు ఈ కేసులో సినీ నటి మిమి చక్రవర్తి, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ సమన్లు జారీ చేసింది.

ఈడీ అధికారులు చెప్పినట్లు ఈ ఇద్దరు ప్రముఖులు కొన్ని అక్రమ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్లు చేశారని అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వీరు వాటికి సంబంధించిన ప్రకటనల్లో పాల్గొన్నారా? పాల్గొంటే ఎలాంటి ఫీజులు తీసుకున్నారనే దానిపై ఈడీ విచారణ చేస్తోంది. గతంలో ఈ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా కూడా విచారణకు హాజరయ్యారు. వారి నుంచి ఈడీ కీలక సమాచారం సేకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande