ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.): దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో మన మార్కెట్ సూచీలూ నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ ఐదు రోజుల వరుస లాభాల తర్వాత నష్టపోయింది. ముఖ్యంగా వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం నిర్ణయం వేళ (16, 17 తేదీల్లో) మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండడం, మార్కెట్‌ను ఉత్సాహపరిచే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు డీలా పడ్డాయి. ఈసారి ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు రాణించడం గమనార్హం.
స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 118.96 పాయింట్ల నష్టంతో 81,785.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.80 పాయింట్ల నష్టంతో 25,069.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.20గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టైటాన్, సన్‌ఫార్మా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఎటెర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67.12 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3,645 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ