దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయవద్దు: మంత్రి సీతక్క
తెలంగాణ, ములుగు. 15 సెప్టెంబర్ (హి.స.) రానున్న మేడారం మహా జాతరపై ములుగుజిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సోమవారం మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్
మంత్రి సీతక్క


తెలంగాణ, ములుగు. 15 సెప్టెంబర్ (హి.స.)

రానున్న మేడారం మహా జాతరపై ములుగుజిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సోమవారం మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ..

గిరిజన గోత్రాలు, పూజ ఆచారాల ప్రకారం అమ్మవార్ల పూజారుల అంగీకారం పూర్తి అయిన అనంతరమే గద్దెల ప్రాంతంలో నూతన టెక్నాలజీతో పనులను ప్రారంభించడం జరుగుతుందని, పూర్తిస్థాయిలో డీ పీ ఆర్ పూర్తికాగానే ముఖ్యమంత్రి ముందు సమావేశమై పూర్తి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దేవుని దగ్గర రాజకీయాలు చేయడం మానుకోవాలని ఇతర పార్టీలకు హితవు పలికారు.

.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande