తెలంగాణ, నల్గొండ. 15 సెప్టెంబర్ (హి.స.)
విద్యాసంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత—విలువలతో, శ్రేష్ఠత కోసం నిరంతర కృషితో రూపుదిద్దుకున్న జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన నాలుగో స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించగా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. తరువాత ఇండోర్ స్టేడియంలో మొక్కలు నాటి, 22 మందికి పీహెచ్ఎ డిగ్రీలు, 57 మందికి స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం గ్రామీణ విద్యార్థులకు పోషణ వేదికగా నిలుస్తోందని, చాలామంది మొదటి తరం అభ్యాసకులుగా బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతున్నారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు