చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గాన్ సంచిలో.మహిళా మృతదేహం
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్‌: చర్లపల్లి రైల్వేస్టేషన్‌ గోడ వద్ద గోనె సంచెలో మహిళ మృతదేహం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తు్న్నారు. నిన్న ఉదయం 11.45 గంటలకు మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆ
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గాన్ సంచిలో.మహిళా మృతదేహం


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్‌: చర్లపల్లి రైల్వేస్టేషన్‌ గోడ వద్ద గోనె సంచెలో మహిళ మృతదేహం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తు్న్నారు. నిన్న ఉదయం 11.45 గంటలకు మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. బిహార్‌కు వెళ్లే రైలు కోసం నిన్న భారీగా ప్రయాణికులు స్టేషన్‌ సమీపంలో వేచి ఉన్నారు.. అదే సమయంలో ఆటోలో అక్కడికి వచ్చిన వ్యక్తి మూటను వదిలి వెళ్లినట్టు గుర్తించారు. బిహార్‌కు వెళ్లే రైలు ఆలస్యంగా రావడంతో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణికులు అక్కడే ఉన్నారు. ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత అక్కడ మూట ఉండటాన్ని స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande