అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు) సమీక్షించారు. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ సంతృప్త స్థాయిలో సేవలు అందించట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తామన్నారు. రెండు నెలల్లో వంద శాతం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మానిపులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తెస్తామన్నారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వైపు మనం ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఆర్టీజీ జిల్లా కేంద్రాలు అక్టోబర్ చివరి నాటికి సిద్ధమవుతాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ