అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నం: విశాఖపట్నం ( ఎంపీ శ్రీభరత్ (సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెంటోసా ఐలాండ్‌ను ఎంపీ సందర్శించారు. అక్కడి బీచ్‌లు, మౌలిక సదుపాయాలను పరిశీలించి విశాఖలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే సెంటోసా అభివృద్ధి ప్రయాణం, అమలు చేసిన వ్యూహాల గురించి మేనేజ్‌మెంట్ టీమ్ శ్రీభరత్‌కి వివరంగా అవగాహన కల్పించింది.
స్థిరమైన అభివృద్ధి, ప్రపంచస్థాయి ఉత్తమ పద్ధతులు, అధునాతన సౌకర్యాలతో పర్యాటకులకు మెరుగైన అనుభవం కల్పించే మార్గాలపై దృష్టిపెడుతున్నట్లు ఎంపీ చెప్పారు. టూరిజం, భద్రత నిర్వహణలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా పలు అంశాలపై వారితో ఆయన చర్చించారు. విశాఖకు సముద్ర తీరం, సాంస్కృతిక వారసత్వం, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లకు వేదిక కావడానికి ఉన్న అవకాశాలను శ్రీభరత్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ