నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.) సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. రాంగ్‌ రూట్‌లో టిప్పర్‌ వేగంగా వచ్చి
सड़क दुर्घटना


అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)

సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. రాంగ్‌ రూట్‌లో టిప్పర్‌ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది.

టిప్పర్‌ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande