పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి షాక్..
పాట్నా, 17 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస
పాట్నా హై కోర్ట్


పాట్నా, 17 సెప్టెంబర్ (హి.స.)

ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.

బుధవారం విచారించిన పాట్నా హైకోర్టు.. సోషల్ మీడియా నుంచి మోడీ, ఆయన తల్లికి సంబంధించిన ఏఐ వీడియోను తొలగించాలని చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రీ కాంగ్రెస్ పార్టీని ఆదేశించారు. అన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి తక్షణమే తొలగించాలని సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande