హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ లో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యాపారం చేసే బిజినెస్ మెన్ లే టార్గెట్ గా బుధవారం ఐటి దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారుల ఇండ్లపై ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు బంగారం హోల్సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపారంపై దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ డీటెయిల్స్ తీసుకున్నారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై పలు అనుమానాలు అధికారులు వ్యక్తం చేశారు. హైదరాబాదులోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ పై మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ..
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ... బంగారం కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్స్ కు అమ్ముతున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ.. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థలపై ఐటి సోదాలు నిర్వహించింది. బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలలో పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు