నిరుద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర వెలకట్టలేనిదని వారి సమస్యలను పరిష్కరించేందుకు వారికి ప్రభుత్వానికి వారధిగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నిరుద్యోగుల ఆహ్వానం మేరకు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర సాధనలో

నిరుద్యోగుల పాత్ర వెలకట్టలేనిదని వారి సమస్యలను పరిష్కరించేందుకు వారికి ప్రభుత్వానికి వారధిగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయన్నారు. పదేళ్ల పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారన్నారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ యువత కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్య పడొద్దన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande