తెలంగాణ, సూర్యాపేట. 17 సెప్టెంబర్ (హి.స.)
అమరుల త్యాగాల ఫలితమే
స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముందుగా మంత్రి జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీస్ లచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ గీతాలాపన, రాష్ట్రీయ గీతాలాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము జరుపుకుంటున్న శుభసందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం కోసం, అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు ఘటిస్తూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభసందర్భంగా ఈ రోజు ఇక్కడ హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కళాకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు