దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి.. రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య
రైతు కమిషన్ చైర్మన్


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే

దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటివరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృభాష అణచివేత, మతపరమైన ధోరణులు తొలగి 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande