రాజన్న సిరిసిల్ల, 17 సెప్టెంబర్ (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటూ అలసి సొలసి పోతున్నారు.
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోనీ మహిళ గ్రూప్ ద్వారా చేపట్టిన దుకాణంలో 450 యూరియా బస్తాలు రాగా, బుధవారం ఉదయాన్నే బద్దెనపల్లిలోనీ రైతు వేదికకు చేరుకున్నారు. క్యూలైన్లో పాసుబుక్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. రైతు వేదికలు వ్యవసాయ అధికారులు ఒక బస్తా టోకెన్ ఇవ్వడంతో, సుమారు 200మంది రైతులు క్యూ లైన్లో నుంచి నిరాశతో వెనుతిరిగారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..