హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) గ్రూప్ 1 అంశంపై టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..