అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)
, ఒంగోలు క్రీడావిభాగం: ఏనుగులదిన్నెపాడు(వై.డి.పాడు)... ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఓ చిన్న పంచాయతీ. దీని పరిధిలోని కుగ్రామం చట్లమిట్ట నుంచి మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులుగా ఐదుగురు ఎంపికయ్యారు. ఈ ఘనత వెనుక ఓ వ్యాయామ ఉపాధ్యాయుడి కృషి, ప్రేరణ ఉన్నాయి. ఆయన పేరు ఓగుబోయిన శ్రీనివాసులు. చట్లమిట్ట విద్యార్థులంతా వై.డి.పాడు జడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదువుతుంటారు. వీరికి ఖోఖోలో ప్రవేశం ఉంది. ఈ పాఠశాలకు 2009లో ఫిజికల్ డైరెక్టర్‌గా వచ్చిన శ్రీనివాసులు వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. చట్లమిట్టలో నివాసం ఏర్పరచుకుని... ఖోఖోతో పాటు వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, టెన్నికాయిట్, యోగా, అథ్లెటిక్స్, క్రికెట్‌లలో కఠోర శిక్షణ ఇచ్చారు.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌తో పాటు వివిధ పోటీలకు తీసుకెళ్లేవారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ