మెదక్, 18 సెప్టెంబర్ (హి.స.)
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో గత
రాత్రి కురిసిన భారీ వర్షానికి గాయత్రి నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాయత్రి నగర్ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు బారికెట్లు పెట్టి భద్రత కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..