రాష్ట్రంలో 11 కొత్త రైల్వే లైన్ ల నిర్మాణం
అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.): రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా.. సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ మీదుగా హైదరాబాద్‌ నుంచి బ
రాష్ట్రంలో 11 కొత్త రైల్వే లైన్ ల నిర్మాణం


అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.): రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా.. సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ మీదుగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి చెన్నైలకు బుల్లెట్‌ రైళ్లు నడిపేలా హైస్పీడ్‌ కారిడార్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు.. అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్‌ నిర్మాణానికి డీపీఆర్‌లు తయారు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు రైల్వేశాఖ డీపీఆర్‌లు రూపొందిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande