యూరియా కోసం.. మహబూబ్నగర్లో రోడ్డుపై బైఠాయించిన రైతులు
మహబూబ్నగర్, 18 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మహబూబ్నగర్ జిల
యూరియా కష్టాలు


మహబూబ్నగర్, 18 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో యూరియా కోసం

అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో పీఏసీఎస్ వద్దకు బుధవారం రాత్రే చేరుకున్న రైతులు అక్కడే నిద్రించారు. గురువారం ఉదయం యూరియా ఇస్తారన్న విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హన్వాడకు చేరుకుని అక్కడే పడుకున్నారు. ఈ ఉదయం భారీగా లైన్లలో వేచిఉన్నారు.

మహబూబ్నగర్ మండలంలోని కోటకద్ర ధర్మాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించడంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసకున్నది. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని, అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande