సీఎం చేతుల మీదుగా రేపు ఇందిరమ్మ గృహప్రవేశాలు.. మంత్రి పొంగులేటి
తెలంగాణ, ఇల్లందు. 2 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి భారీ ఎత్తున గృహప్రవేశాలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఇల్లందు. 2 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి భారీ ఎత్తున గృహప్రవేశాలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన బెండలపాడులో సామూహిక గృహప్రవేశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రారంభోత్సవం రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలిచిపోనుందని తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు నిదర్శనమే ఈ సామూహిక ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు అని స్పష్టం చేశారు. బుధవారం సీఎం పర్యటనను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande