రాజన్న సిరిసిల్ల.2 సెప్టెంబర్ (హి.స.)
విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టుల పై పట్టు సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని అన్ని తరగతి గదులు, వంటగదిని స్వయంగా తిరిగి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా
విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ పాఠాలను బోధించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు హిందీ టెక్స్ట్ బుక్ లోని పాఠ్యాంశాన్ని చదవలేకపోవడం గమనించి టీచర్ పై అసహనం వ్యక్తం చేశారు.
విద్యాలయం గదుల్లోకి దోమలు, పురుగులు, పాములు రాకుండా కిటికీలను రిపేర్, మెష్ లు ఏర్పాటు చేయించాలని, వాటర్ లీకేజీలు, బిల్డింగ్ మీద నీరు నిల్వ కాకుండా రూఫ్ లీకేజీ కాకుండా మరమ్మత్తు చేయించాలని అధికారులకు సూచించారు. విద్యాలయం, సిబ్బంది క్వార్టర్స్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ సెక్రటరీ ని ఆదేశించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు