తెలంగాణ, సిద్దిపేట. 2 సెప్టెంబర్ (హి.స.)
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ అనురాధ అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు ముందుకు రావడం పట్ల వ్యాపారస్తులను సీపీ అభినందించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమైన చౌరస్తాలలో ఎంట్రీ, ఎగ్జిట్ 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు. నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నేరాలను నియంత్రించడంలో నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పని చేస్తాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు