'కాంచన 4': దడపుట్టించే పాత్రలో రష్మిక?
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)కోలీవుడ్ నుంచి దెయ్యం నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ''కాంచన'' పరిస్థితి వేరు. తమిళంలో ''ముని'' సినిమాతో దర్శకుడిగా లారెన్స్ ప్రయాగం చేసినప్పుడు ముందుగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత థియేటర్లలో సందడి చేయ
'కాంచన 4': దడపుట్టించే పాత్రలో రష్మిక?


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)కోలీవుడ్ నుంచి దెయ్యం నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే 'కాంచన' పరిస్థితి వేరు. తమిళంలో 'ముని' సినిమాతో దర్శకుడిగా లారెన్స్ ప్రయాగం చేసినప్పుడు ముందుగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది. 'ముని' సినిమాకి సీక్వెల్ గా ఆయన తెరకెక్కించిన 'కాంచన' .. 'కాంచన 2' .. 'కాంచన 3' భారీ విజయాలను నమోదు చేశాయి. అయితే 'కాంచన 2' ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టగలిగింది.

'కాంచన 4' కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా పనులతోనే లారెన్స్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం పూజ హెగ్డేను .. నోరా ఫతేహిని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. రీసెంటుగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. పూజ హెగ్డే స్థానంలో ఆమెను తీసుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ రష్మికను ఒక కీలకమైన పాత్ర కోసం ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించేది ఆమెనేనని అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande