హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ చిత్రానికి తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే.. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల ఉండగా.. ఈ సమయంలో హైకోర్టు అనూహ్య షాక్ ఇవ్వడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, తమన్ సంగీతం అందించారు. శ్రియారెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు