నిజామాబాద్ పేరును 'ఇందూరు'గా మారుస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, 10 జనవరి (హి.స.) నిజామాబాద్ పేరు మార్పు పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రతిపాదనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాసటగా నిలిచారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును కచ్చితంగా ''ఇందూరు''గా
బీజేపీ చీఫ్


హైదరాబాద్, 10 జనవరి (హి.స.) నిజామాబాద్ పేరు మార్పు పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ ప్రతిపాదనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాసటగా నిలిచారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును కచ్చితంగా 'ఇందూరు'గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు పార్టీ కట్టుబడి ఉందని, ఇది తమ నిబద్ధత అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత పేర్లు నిజాం కాలం నాటి నిరంకుశత్వాన్ని, అరాచకాలను గుర్తుచేసేలా ఉన్నాయని రాంచందర్ రావు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. అందుకే కేవలం నిజామాబాద్ మాత్రమే కాకుండా, నిజాం పాలన ఆనవాళ్లుగా ఉన్న అనేక ఇతర ప్రాంతాల పేర్లను కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాటి పీడనను గుర్తుచేసే పేర్లను తొలగించడమే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande