మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి.హత్య కేసు దర్యాప్తు ముగిసింది
అమరావతి, 12 మార్చి (హి.స.) న్యూఢిల్లీ, ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జిషీటు కూడా దాఖలు చేశామని.. ఇక తదుపరి దర్యాప్తు ఏమీ అవసరం లేదని సుప
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి.హత్య కేసు దర్యాప్తు ముగిసింది


అమరావతి, 12 మార్చి (హి.స.)

న్యూఢిల్లీ, ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జిషీటు కూడా దాఖలు చేశామని.. ఇక తదుపరి దర్యాప్తు ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలింది దిగువ కోర్టు విచారణ మాత్రమేనని పేర్కొంది. ఈ వాదనతో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విభేదించారు. తమ అభ్యంతరాలపై స్పష్టత రాలేదని.. ఈ కేసులో తమ వద్ద కీలక మెటీరియల్ ఉందని తెలిపారు. నిందితుల ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నందున.. వాటిని పరిగణనలోకి తీసుకుని వారికిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. నిందితులు గతంలో కేసును ప్రభావితం చేసిన అంశాలను గమనంలోకి తీసుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి (ఏ-5), వైఎస్ అవినాశ్రెడ్డి (ఏ-8), వైఎస్ భాస్కర్రెడ్డి (ఏ-7), గజ్జల ఉదయ్కుమార్రెడ్డి (ఏ-6), యాదాటి సునీల్ యాదవ్(ఏ-2), గంగిరెడ్డి(ఏ-1)లకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని సునీతారెడ్డి, సీబీఐ వేర్వేరు పిటిషన్లు దాఖలుచేయడం తెలిసిందే. కేసులో అన్ని కుట్రకోణాలను వెలికితీసేంతవరకూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఆదేశాలించాలని సునీతారెడ్డి కోరగా.. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కేవలం ఇద్దరి పాత్రను వెలికితీసేంతవరకే దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్తో పాటు అన్ని వ్యాజ్యాలనూ కలిపి బుధవారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. అన్నీ సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలనుకోవడం సరికాదని, దిగువ కోర్టుకు వెళ్లాలని స్పష్టంచేసింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో.. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని ఆదేశించింది. సీఆర్పీసీ సెక్షన్ 207 కింద నిందితులకు చార్జిషీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేసే ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సూచించింది. ఇది ముగిసిన వెంటనే, వీలైనంత వేగంగా కేసు ట్రయల్ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande