వంద రోజులకు చేరిన డిండి ఎత్తిపోతల పథకం బాధితుల దీక్షలు
నాగర్ కర్నూల్, 12 మార్చి (హి.స.) డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండల పరిధి గ్రామాలైన ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలు ముంపునకు గురి కాకూడదని, పునరావాసం, పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలన
ఎర్రవల్లి బాధితులు


నాగర్ కర్నూల్, 12 మార్చి (హి.స.)

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండల పరిధి గ్రామాలైన

ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలు ముంపునకు గురి కాకూడదని, పునరావాసం, పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఎర్రవల్లి గ్రామ ముంపు బాధితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి అనగా గురువారానికి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో బాధితులు మాట్లాడుతూ దీక్ష ఫలితాల్లో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గత అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించారని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరూ ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మా సమస్యను తెలియజేశామని అన్నారు. ఇలా గత రెండు సంవత్సరాలుగా మాకు హామీలు మాత్రమే ఇస్తున్నారు కానీ ఆచరణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని తెలిపారు. అందుకే త్వరలో బాధిత గ్రామ ప్రజలతో చర్చించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. మా ఆవేదనను అర్థం చేసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా బాధితులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande