
అమరావతి, 12 మార్చి (హి.స.)
తిరుపతి: కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. మంగళం 1, 2 డిపోలుగా విభజించి 50చొప్పున బస్సుల నిర్వహణ బాధ్యతలను వేర్వేరు ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. తొలివిడతగా నాలుగునెలల్లో 50 ఈకా ఎలక్ర్టిక్ బస్సులు రానున్నాయి. వీటికి పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. తాజాగా మంగళం డిపోకే మరో 50బస్సులు కేటాయించడంతో ఆ డిపో పూర్తిగా గ్రీన్ఫీల్డ్గా మారనుంది. దాంతో బస్సుల కొనుగోలు, మౌలికసదుపాయాల ఏర్పాట్లకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరిస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ