
తిరుమల, 12 మార్చి (హి.స.)
:తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమల లో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది. రెండడుగుల పొడవు మాత్రమే ఉన్న ఈ పాము సాధారణ నాగుపాముల తరహాలోనే పడగతో కనిపించగా అక్కడి సిబ్బంది పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కరనాయుడికి సమాచారమిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ